ఉప్పాకలో చిన్నారులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

G Rajashekar
By -
0

 


EB NEWS/పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామంలోని ఎం.పీ.యు.పి.ఎస్ పాఠశాలలో చిన్నారుల కోసం రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు దాటే సమయంలో ఇరువైపులా చూసుకుని జాగ్రత్తగా దాటాలని సూచించారు.


అలాగే   ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో పెద్దలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వేసుకోవాలని తెలియజేశారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్లు ఉపయోగించకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని వివరించారు. ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడం ద్వారా తమ ప్రాణాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుభద్ర, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, రవి, శ్రీకాంత్, అనూష, మణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)