రూ.20 కడితే రూ.2 లక్షల బీమా.. ఈ పథకం గురించి తెలుసా?

G Rajashekar
By -
0

 


EB NEWS/TG


 తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా అందించే కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY). ఈ పథకం కింద ఏడాదికి కేవలం రూ.20 ప్రీమియం చెల్లించి ప్రమాద బీమా పొందవచ్చు.


ఈ పథకానికి 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. దరఖాస్తుదారుడికి బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లో సేవింగ్స్ ఖాతా ఉండాలి. పథకంలో చేరిన తర్వాత ప్రతి సంవత్సరం ఖాతా నుంచి ప్రీమియం ఆటో-డెబిట్ అవుతుంది.


ప్రమాదవశాత్తు మరణం లేదా నిర్దిష్ట రకాల పూర్తి శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు రూ.2 లక్షల వరకు బీమా ప్రయోజనం లభిస్తుంది. పథకంలో చేరేందుకు సంబంధిత బ్యాంకు/పోస్టాఫీస్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)