EB NEWS/మణుగూరు:
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మణుగూరు మండలంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శ్రీవిద్య టెక్నో జూనియర్ కాలేజీకి చెందిన ఈ.పి. వవిత్ర 470లో 467 మార్కులు, వనమాల సాయి స్రుతి 470లో 464 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచినందుకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
విద్యార్థులు పట్టుదలతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని, విద్యే భవిష్యత్తును నిర్మించే ప్రధాన మార్గమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు శివ సైదులు, మైనారిటీ అధ్యక్షుడు రహీం పాషా, ఎస్. గణేష్ రెడ్డి, ఉప సర్పంచ్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

