పినపాక: ఏజెన్సీ ప్రాంతం నుంచి రాష్ట్రస్థాయి ప్రతిభ… గుండు పవిత్రకు ఘన సత్కారం

G Rajashekar
By -
0

 



EB NEWS/పినపాక:


పినపాక మండలం ఈ బయ్యారం గ్రామానికి చెందిన విద్యార్థిని గుండు పవిత్ర ఇంటర్మీడియట్‌లో 989 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం బుధవారం ఆమెను కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు.


ఏజెన్సీ ప్రాంతం నుంచి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో పవిత్ర జిల్లా కలెక్టర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.


పవిత్ర తల్లిదండ్రులు సురేష్, శిరీష ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ నాయకులు బషీరుద్దీన్, గుండు రమేష్ తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)