ప్రజల మన్ననలు పొందుతున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు – అభివృద్ధి పనులతో జోష్

 




 అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు – వరుసగా నిధుల మంజూరు!


EB NEWS/ పినపాక నియోజకవర్గం:


పినపాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వేగం పెంచుతూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దూసుకుపోతున్నారు. ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించడంలో ముందుంటూ వరుసగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తున్నారు.


ఇటీవల మణుగూరు నుంచి బయ్యారం క్రాస్ రోడ్ వరకు ఉన్న రహదారి మరమ్మత్తుల కోసం రూ.50 లక్షలు మంజూరు చేయించారు. ఈ పనులతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలకు పెద్ద ఊరట లభించనుంది.


అలాగే భూర్గంపాడు మండలంలో దాదాపు 800 ఎకరాల సాగు భూములకు నీరు అందేలా చర్యలు తీసుకోవడంతో రైతులకు సాగు నీటి సమస్యకు పరిష్కారం లభించింది. రైతులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.


తాజాగా అశ్వాపురం మండలంలోని ఒక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేయించారు. దీంతో విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందుబాటులోకి రానున్నాయి.


ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు, రోడ్ల సమస్యలు వంటి ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ పరిష్కార మార్గాలు చూపుతున్నారని స్థానికులు ప్రశంసిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి.



Post a Comment

أحدث أقدم