జ్యోతిష్యం నమ్మకం ప్రాణం తీసింది.. భార్యను హత్య చేసిన భర్త

G Rajashekar
By -
0



EB NEWS/ములుగు:


ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పెద్దాపూర్ గ్రామంలో జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. భర్త గోదారి రాజ సమ్మయ్య తన భార్య సంధ్యను హత్య చేసి అనంతరం స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు.


సమాచారం అందుకున్న ములుగు సీఐ సురేశ్, ఎస్ఐ చల్ల రాజు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. 


స్థానికుల సమాచారం ప్రకారం కోయ జ్యోతిష్యం చెప్పిన మాటలను నమ్మి ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు కారణాలు ఏమిటి అన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టారు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.



إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)