EB NEWS/హైదరాబాద్:
గత కొన్ని రోజులుగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తిరిగి హైదరాబాద్‌కు రప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
దుబాయ్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తన అల్లుడు కళ్యాణ్ శేఖర్‌ను పరామర్శించేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. అయితే ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో మంత్రి అక్కడే నిలిచిపోయారు.
మంత్రి సురక్షితంగా హైదరాబాద్‌కు చేరుకునేలా విదేశాంగ శాఖతో పాటు సంబంధిత అధికారులతో సమన్వయం కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తూ త్వరితగతిన ప్రయాణ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మంత్రి త్వరలోనే హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

إرسال تعليق