మంగపేట మండలంలో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు

G Rajashekar
By -
0



 EB NEWS/మంగపేట


ములుగు జిల్లా మంగపేట మండలంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని కొంటపల్లి గ్రామానికి చెందిన జవాజీ నరసయ్య బందగిరినగరం నుంచి తన ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రాజుపేట టర్నింగ్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడింది.


ఈ ప్రమాదంలో నరసయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన నరసయ్యను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)