అశ్వాపురం మండలంలో గ్యాస్ గోదాముపై ఆకస్మిక తనిఖీలు

G Rajashekar
By -
0



 EB NEWS/అశ్వాపురం:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండుకుంట ప్రాంతంలోని గ్యాస్ గోదాములో సివిల్ సప్లై డీటీ శివకుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోదాములో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్ల వివరాలు, సరఫరా విధానం, రికార్డులను పరిశీలించారు.


ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గోదాం నిర్వాహకులకు శివకుమార్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన నియమావళి ప్రకారం మాత్రమే గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేయాలని సూచించారు.


అక్రమాలపై ఎలాంటి సమాచారం వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా అనుమానాస్పదంగా గ్యాస్ విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు. 


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)