EB NEWS/మంచిర్యాల:
మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌లో ప్రమాదవశాత్తు పెన్ను క్యాప్ మింగిన బాలుడిని వైద్యులు సమయానికి చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
వివరాల్లోకి వెళ్తే… నస్పూర్ ప్రాంతానికి చెందిన అఖిల్ అనే బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటుండగా పొరపాటున పెన్ను క్యాప్‌ను నోటిలో పెట్టుకొని మింగేశాడు. వెంటనే బాలుడు అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితిని పరిశీలించిన వైద్యులు బాలుడి గొంతులో పెన్ను క్యాప్ చిక్కుకుపోయినట్లు గుర్తించారు. వెంటనే ఎండోస్కోపీ విధానం ద్వారా ఎంతో జాగ్రత్తగా పెన్ను క్యాప్‌ను బయటకు తీశారు. దీంతో బాలుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.
సమయానికి స్పందించి చికిత్స అందించిన వైద్యులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నపిల్లలు ఆడుకునే సమయంలో ఇలాంటి చిన్న వస్తువులు నోటిలో పెట్టుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

إرسال تعليق