కారు ఢీకొట్టే లోపే… దూసుకెళ్లిన కుక్క! పిల్లాడి ప్రాణాలు రక్షణ

 




EB NEWS:


రోడ్డుపై ప్రమాదం క్షణాల్లో జరిగిపోతుంది.. కానీ అదే క్షణాల్లో ఒక పెంపుడు శునకం చూపించిన చాకచక్యం ఓ చిన్నారి ప్రాణాలను కాపాడింది. ఈ హృదయాన్ని హత్తుకునే ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ చిన్నారి ఇంటి ముందు రోడ్డు పక్కన బాల్‌తో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ ఉండగా బాల్ రోడ్డు మీదకు వెళ్లడంతో, దాన్ని తీసుకురావడానికి పిల్లాడు పరుగెత్తాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న కారు అతడిని ఢీకొట్టే పరిస్థితి ఏర్పడింది.

ఇది గమనించిన ఇంటి మెట్లపై కూర్చున్న పెంపుడు కుక్క ఒక్కసారిగా అప్రమత్తమై, వెంటనే పరుగెత్తి వెళ్లి పిల్లాడిని వెనక్కి లాగినట్టుగా కనిపించింది. దీంతో క్షణాల్లోనే పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్పష్టత లేకపోయినా.. వీడియో మాత్రం నెటిజన్లను కదిలిస్తోంది. శునకం చూపించిన నిబద్ధత, విశ్వాసంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. “ఇలాంటి విశ్వాసం మనుషుల్లో కూడా ఉండాలి” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇదే సమయంలో కొందరు చిన్నారిని ఒంటరిగా రోడ్డుపక్కన ఆడనివ్వడం పట్ల తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతున్నారు.

ప్రాణాలకు ముప్పు వచ్చిన సమయంలో ఒక జంతువు చూపించిన స్పందన.. మరోసారి ‘శునక విశ్వాసం’ అంటే ఏమిటో గుర్తుచేసింది.

Post a Comment

కొత్తది పాతది