ప్రజల ఆరోగ్యం కోసం ముందడుగు – పినపాకలో మెగా హెల్త్ క్యాంప్- డాక్టర్ దుర్గా భవాని



EB NEWS/ పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రముఖ స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ఈ నెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ డా. దుర్గా భవాని తెలిపారు. 


ఈ శిబిరంలో పంటి నొప్పులు, మహిళల ఆరోగ్య సమస్యలు, కీళ్ల నొప్పులు, చిన్నపిల్లల వ్యాధులు, కంటి సమస్యలు మరియు సాధారణ ఆరోగ్య సమస్యలకు సంబంధించి స్పెషలిస్ట్ డాక్టర్లు సేవలు అందించనున్నారు.


అన్ని రకాల ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, గుర్తించిన వ్యాధులకు అవసరమైన మందులు కూడా ఉచితంగా అందిస్తామన్నారు.


క్యాంపుకు హాజరయ్యే వారు తమ పాత మెడికల్ రికార్డులు (రిపోర్టులు/ప్రిస్క్రిప్షన్లు) తీసుకురావాలని సూచించారు. అలాగే పేరు నమోదు కోసం ఆధార్ కార్డు మరియు మొబైల్ ఫోన్ తీసుకురావాలని ఆమె తెలిపారు.


ఈ అరుదైన అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


Post a Comment

కొత్తది పాతది