సీఎం రాకతో అరెస్టు చేయటం కరెక్ట్ కాదు పలు పార్టీ నేతలు
EB NEWS /మణుగూరు:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరుకానున్న నేపథ్యంలో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా విపక్ష పార్టీల నాయకులు, యువజన సంఘాలు నిరసనలు చేపట్టే అవకాశమున్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ముందస్తు చర్యలకు దిగిన పోలీసులు పలు ప్రాంతాల్లో నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. మణుగూరు మండలంలో ఈ చర్యలు మరింత తీవ్రంగా కనిపిస్తున్నాయి.
తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అలాగే సీపీఎం మణుగూరు మండల కార్యదర్శి సత్రపతి సాంబశివరావును కూడా అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు నాగేశ్వరావుతో పాటు మరికొందరు సీపీఎం నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పోలీసుల చర్యలపై విపక్ష పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని వారు పేర్కొంటున్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి