TG: డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు మరింత కఠినం… ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు



 EB NEWS/తెలంగాణ:


తెలంగాణ రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియను మరింత కఠినంగా మార్చేందుకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది.


ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో రోడ్డు భద్రతా పాఠాలు తప్పనిసరిగా అభ్యసించాలి. ఆ తరువాత నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పరీక్షలో పాస్ అయిన వారికి సర్టిఫికెట్ నంబర్ జారీ చేస్తారు.


ఈ సర్టిఫికెట్ నంబర్ పొందిన తర్వాత మాత్రమే లెర్నర్ లైసెన్స్ (LLR) కోసం స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దీంతో లైసెన్స్ ప్రక్రియలో నిర్లక్ష్యం తగ్గి, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.


ఈ కొత్త విధానం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇకపై లైసెన్స్ పొందాలంటే ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై సరైన అవగాహన తప్పనిసరి అవుతుందని రవాణా శాఖ స్పష్టం చేసింది.


Post a Comment

కొత్తది పాతది