సీతారామ ప్రాజెక్టులో ఇనుము దొంగిలించడానికి యత్నం... చివరికి

  


సీతారామ ప్రాజెక్టులో ఇనుము చోరీ… ట్రాక్టర్ పట్టుకున్న ఎల్&టీ అధికారులు


EB NEWS/అశ్వాపురం:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, అమ్మగారిపల్లి వద్ద జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులకు సంబంధించిన ఇనుమును దొంగిలించి తరలించేందుకు యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇనుముతో పారిపోతున్న ట్రాక్టర్‌ను ఎల్&టీ సంస్థ అధికారులు పట్టుకున్నారు.

సమాచారం మేరకు, ప్రాజెక్టు ప్రాంగణం నుంచి ఇనుమును అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించిన అధికారులు వెంటనే ట్రాక్టర్‌ను ఆపి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్‌లో ఉన్న వ్యక్తులు వాహనాన్ని విడిచిపెట్టాలని వేడుకుంటూ అధికారుల కాళ్లు పట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించగా, తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.

Post a Comment

أحدث أقدم