TELANGANA, EB NEWS:
పేదల ఆత్మగౌరవాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పండుగలా సాగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విజయానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణే కారణమని సీఎం ప్రశంసించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నేరుగా ఐదు లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయంటే, అది మంత్రి పొంగులేటి సమర్థవంతమైన నిర్వహణకు నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు భద్రతతో కూడిన నివాసం అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి