నిరుద్యోగులకు బంగారు అవకాశం.. కొత్తగూడెంలో ఇంటర్వ్యూలతో నియామకాలు



EB NEWS/ భద్రాద్రి:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. పాల్వంచలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ సంస్థలో మొత్తం 25 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరాం తెలిపారు.


ఈ నియామకాలకు 21 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.15,250 జీతం అందించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 5.6 అడుగుల ఎత్తు గల పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు సంబంధిత ధృవపత్రాలతో కలిసి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అధికారులు సూచించారు.అర్హతలు కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Post a Comment

కొత్తది పాతది