తమ్ముడు హత్య కేసులో అన్న అరెస్ట్

G Rajashekar
By -
0

 


అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


అశ్వాపురం మండలం చవిటిగూడెం గ్రామంలో ఈ నెల 6న జరిగిన హత్య కేసులో నిందితుడైన బాతిక అరుణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు బాతిక విజయ్ మద్యం సేవించి వచ్చి తన తల్లి సత్యవతిని కొట్టడంతో కుటుంబంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న మంచం కర్రతో అరుణ్ కొట్టడంతో విజయ్ తీవ్రంగా గాయపడి మణుగూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)