పినపాకలో అరుదైన గుడ్లగూబ

G Rajashekar
By -
0


ఇంటి ఆవరణలో గాయాలతో పడిన అరుదైన గుడ్లగూబ – ఫారెస్ట్ అధికారులకు అప్పగింత


EB NEWS/పినపాక, ప్రతినిధి రాజశేఖర్:

పినపాక మండలంలోని ఎల్చిరెడ్డిపెళ్లి గ్రామంలో అరుదైన గుడ్లగూబ కనిపించడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. గ్రామానికి చెందిన బోడ లక్ష్మణరావు ఇంటి ఆవరణలో గాయాలతో పడివున్న గుడ్లగూబను కుటుంబ సభ్యులు గమనించారు.

గాయాలతో ఉన్న ఆ పక్షికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి, గుడ్లగూబను బయ్యారం ఫారెస్ట్ కార్యాలయానికి అప్పగించారు.

అటవీ శాఖ అధికారులు పక్షిని పరిశీలించి అవసరమైన వైద్యం అందించనున్నట్లు తెలిపారు. చికిత్స అనంతరం దాన్ని సహజ వాతావరణంలో విడిచిపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

బాధ్యతలో స్పందించి అరుదైన పక్షిని రక్షించడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.



إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)