ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు...

G Rajashekar
By -
0



EB NEWS /భద్రాద్రి కొత్తగూడెం:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో , ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. 


ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న పరీక్షల కోసం జిల్లాలో 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 


ప్రశ్నాపత్రాల తరలింపులో భద్రతా నియమాలు పాటించాలని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 


పరీక్షల రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, పరీక్షా కేంద్రాలలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 


మరోవైపు, గ్రామ అభివృద్ధిలో సర్పంచులే కీలకమని, వివిధ పథకాల కింద వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకుని, గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)