రాయన్న పేటకు రహదారి సౌకర్యం కల్పించాలి




ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పినపాక శాసనసభ్యు పాయం వెంకటేశ్వర్లుకి  వినతిపత్రం అందజేసిన ఆదివాసీలు 


EB NEWS/అశ్వాపురం:


అశ్వాపురం మండల పరిధి మణుగూరు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆదివాసి గిరిజన గ్రామం రాయన్నపేటకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఆదివాసీలు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్డి నాసర్ పాషా మాట్లాడుతూ... రాయన్నపేట ఆదివాసి గ్రామానికి సంబంధించి మణుగూరు రైల్వే స్టేషన్ నుండి కాలిబాట ఉన్నదని, వాహనాల రాకపోకులకు చాలా ఇబ్బంది అవుతోందన్నారు. వర్షాకాలంలో నడవడం కూడా ఇబ్బంది అవుతొందన్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవతో రహదారి నిర్మాణానికి ఐటీడీఏ భద్రాచలం వారు ముప్పయి లక్షలు నిధులు మంజూరు చేసి సంవత్సరం పైగా దాటిందన్నారు. రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని, భద్రాచలం ఎమ్మెల్యే, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ తో మాట్లాడి రహదారి నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. గ్రామానికి విద్యుత్ సౌకర్యం త్రాగునీటి వసతి కల్పించాలని కూడా రానున్న వేసవి నేపథ్యంలో ఇతర ఆదివాసి గ్రామాలలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని అలాగే రహదారి విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు ఏనిక బాలకృష్ణ, రాయన్నపేట గ్రామ పెద్దలు గుండి భీమా, కుంజా రమేష్,కుంజా కుమార్, పవన్, కిషోర్, దేవేందర్,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم