అశ్వాపురం వద్ద అక్రమ పశువుల రవాణా పట్టివేత



EB NEWS అశ్వాపురం:

 మణుగూరు నుంచి మొరంపల్లి బంజరుకు అక్రమంగా తరలిస్తున్న 12 పశువులను అశ్వాపురం పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు పశువులను స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన పశువులను పాల్వంచ గోశాలకు తరలించారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

Post a Comment

కొత్తది పాతది