తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన... వృద్ధులు, మహిళలకు శుభవార్త!




 EB NEWS/ తెలంగాణ:


తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, మహిళలకు ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్‌లు, ఇతర సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


వృద్ధాప్య పెన్షన్‌ను రూ.4000 పెంపుకు, మహిళలకు రూ.2500 సాయం అందించాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే దివ్యాంగులకు ఇచ్చే లైఫ్‌టైమ్ స్కీముల నిధుల పెంపుపై కూడా ఆలోచన కొనసాగుతోంది.


రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే అవకాశముందని సమాచారం. సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల కేటాయింపుపై ఆర్థిక శాఖ ఇప్పటికే సమీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది.


వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొంటున్నారు. బడ్జెట్‌లో స్పష్టత రానున్న నేపథ్యంలో లబ్ధిదారుల్లో ఆసక్తి నెలకొంది.

Post a Comment

కొత్తది పాతది