మణుగూరు:సింగరేణి ఓసి విస్తరణకు భూసేకరణ వేగవంతం – భూ యజమానులు తప్పనిసరిగా హాజరు కావాలి

G Rajashekar
By -
0

 



EB NEWS/మణుగూరు:


 మణుగూరు మండలంలోని సింగరేణి కొల్లిరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఆధ్వర్యంలో ఓపెన్ కాస్ట్ (O.C.) విస్తరణ పనుల కోసం తీర్లాపురం గ్రామంలో నిర్వహించిన ఎంజాయ్‌మెంట్ సర్వేకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం మరియు భూసేకరణ అధికారుల ఆదేశాల మేరకు గత 15 రోజులుగా భూములకు సంబంధించిన పత్రాల పరిశీలన చేపడుతున్నారు.అయితే సర్వే చేయించుకున్న కొంతమంది భూ యజమానులు తమ భూమి ఉన్న ప్రదేశంలో గాని, గ్రామంలో గాని అందుబాటులో లేరని అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని గ్రామంలో పలుమార్లు టామ్‌టామ్ ద్వారా తెలియజేసినప్పటికీ కొందరు హాజరు కాలేదని సమాచారం.

ఈ నేపథ్యంలో సంబంధిత భూ యజమానులు, నిరవాసితులు తమ వద్ద ఉన్న భూమికి సంబంధించిన అన్ని అసలు పత్రాలతో ఈ ప్రకటన విడుదలైన తేదీ నుండి మూడు రోజులలోపు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య మణుగూరు తహసీల్దార్ కార్యాలయానికి తప్పనిసరిగా హాజరు కావాలని తహసీల్దార్ అద్దంకి నరేష్ స్పష్టం చేశారు.

హాజరు కాని పక్షంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు.


భూ యజమానులు, నిరవాసితులు ఈ ప్రకటనను గమనించి సమయానికి స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)