పినపాక: మీ నిర్లక్ష్యానికి ప్రతిఫలం మా ప్రాణాలా?

 


EB NEWS/పినపాక:



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం తోగ్గుడెం గ్రామంలో ప్రధాన రహదారిపై రెండు ప్రమాద మలుపులు ఉన్నాయని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పినా కూడా పట్టించుకునే నాధుడే లేరని  వారు చెబుతున్నారు.  మీ నిర్లక్ష్యానికి ప్రతిఫలం మా ప్రాణాలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా  హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

Post a Comment

కొత్తది పాతది