EB NEWS/ ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. Andhra Pradesh రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వేట్లపాలెం – జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న బాణసంచా తయారీ పరిశ్రమలో అకస్మాత్తుగా జరిగిన పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో 18 మంది కార్మికులు సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతకు మృతదేహాలు ఎగిరిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంకా సుమారు 15 మంది వరకు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.
పేలుడు శబ్దం దూర ప్రాంతాల వరకూ వినిపించిందని, సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
ఇదే ప్రాంతంలో గతంలోనూ పేలుడు సంభవించినట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే కారణమా? లేక ఇతర సాంకేతిక లోపాలా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.
ఈ దుర్ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి