ఖమ్మం: వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ సహాయ చర్యలు



ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ



 ఖమ్మం, ఫిబ్రవరి, 28:


ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల రెవిన్యూ గ్రామంలో భూధాన్ భూమిలో ప్రభుత్వం తొలగించిన గుడిసె వాసులకు బీఆర్ఎస్ పార్టీ ద్వారా సహాయ కార్యక్రమాలు ప్రతి రోజు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పునరావాస కేంద్రాలైన అంబేద్కర్ భవన్, టిటిడిసి కేంద్రాల్లో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో శనివారం బాధితులకు అందజేశారు. ప్రభుత్వం తమ గుడిసెలు తొలగించి, పునరావాస కేంద్రాలకు తరలించి తమకు మంచినీళ్లు భోజనాలు కూడా అందించడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బాధితులే స్వయంగా మెసేజ్ లు పంపిస్తున్నారు. కేటీఆర్ ఆదేశం మేరకు ఎంపీ రవిచంద్ర ముందుకు వచ్చి తన సిబ్బంది, బీఆర్ఎస్ నగర పార్టీ ద్వారా వెలుగుమట్ల బాధితులకు భోజనాలు దగ్గరుండి వడ్డించారు. గూడు చెదిరి, దిక్కుతోచని పక్షుల్లా మిగిలి మిగిలిపోయిన తమకు కడుపునిండా భోజనం పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, ఎంపీ రవిచంద్ర కు వెలుగు మెట్ల బాధితులు చేతులెత్తి ధన్యవాదాలు తెలిపారు. రెండు రోజులుగా కాలకృత్యాలు తీర్చుకోడానికి నీళ్లు కూడా లేవని చెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు ముందుకు వచ్చి ట్యాంకర్ల ద్వారా నీటిని కూడా సమకూర్చారు. ప్రభుత్వం వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, ఎంపీ రవిచంద్ర వ్యక్తిగత సహాయకులు సయ్యద్ ఇస్మాయిల్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్,

బీఆర్టియు నాయకులు ఎస్కే పాషా, నగర పార్టీ ప్రచార కార్యదర్శి షకీనా, వద్దిరాజు అభిమానులు నాన్నబల హరీష్, జగదీష్, ఎండి షారు, రాజేష్, ప్రశాంత్, గణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది