మూడు రంగుల జెండానే జీవితం –రామనాధం సేవలకు గుర్తింపు ఎప్పుడు?



EB NEWS/పినపాక/ ప్రతినిధి రాజశేఖర్:


దశాబ్దాలుగా  కాంగ్రెస్ పార్టీ ఊపిరిగా భావించి, మూడు రంగుల జెండాను నమ్ముకుని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం కష్టకాలాల్లో కూడా ముందుండి నడిపించిన పినపాక మండల అధ్యక్షుడు గోడిశాల రామనాధం  మార్చి 1, 2026న తన జన్మదినాన్ని జరుపుకోనున్నారు.


పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ, సేవా తపన స్థానిక నాయకులు, కార్యకర్తల ప్రశంసలను అందుకుంటోంది. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని విడిచిపెట్టకుండా, సాధారణ కార్యకర్తగా మొదలై మండల అధ్యక్షుడి స్థాయికి ఎదగడం ఆయన పట్టుదలకు నిదర్శనమని కార్యకర్తలు అంటున్నారు.


రామనాధం  జన్మదినాన్ని పురస్కరించుకుని పినపాకలో కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం యువతకు ఆదర్శమని పలువురు అభిప్రాయపడ్డారు.


పార్టీ ని నమ్ముకున్న రామనాధంని పార్టీ, ప్రభుత్వం గుర్తిస్తుందని పార్టీ శ్రేణులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

కొత్తది పాతది