రేషన్ దుకాణాల్లో కొత్త పథకం.. సన్న బియ్యంతో పాటు ఐదు నిత్యావసర సరుకులు



 తెలంగాణ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


తెలంగాణలోని రేషన్ కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే ఏడాది నుంచి రేషన్ దుకాణాల ద్వారా కేవలం సన్న బియ్యం మాత్రమే కాకుండా, సన్న బియ్యంతో పాటు ఐదు రకాల నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సన్న బియ్యం పంపిణీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రేషన్ లబ్ధిదారులకు మరింత మేలు జరగనుంది.

Post a Comment

కొత్తది పాతది