విద్యే భవిష్యత్తు - పిల్లల చదువే లక్ష్యంగా క్షేత్రస్థాయి పరిశీలన..





👉ఆశ్రమ పాఠశాలకు మెరుగైన వసతుల కోసం కృషి చేస్తాం..



👉చిరుమల్ల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన డాక్టర్ చందా సంతోష్ కుమార్ మరియు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్..


కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామ పంచాయతీలోనీ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన టీపీసీసీ సభ్యులు డాక్టర్.చందా సంతోష్ కుమార్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 

➡️పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, వసతులను పరిశీలించి ఇంకా మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు..

➡️తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి *రేవంత్ రెడ్డి* విద్యకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలలు మరియు ఆశ్రమ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారాని వారు పేర్కొన్నారు..

➡️అదేవిధంగా గౌరవ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు *పాయం వెంకటేశ్వర్లు* నాయకత్వంలో ఆశ్రమ పాఠశాల అభివృద్ధి కొరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొని విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని,సంబంధిత అధికారులకు ఐటిడిఏ పిఓ మరియు జిల్లా కలెక్టర్ గార్లకు అలాగే సంబంధిత శాఖ మంత్రివర్యులకు స్వయంగా కలిసి నివేదిక అందించి మరింత అభివృద్ధి కొరకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు..


ఈ కార్యక్రమంలో

చిరుమల్ల సర్పంచ్ కొమరం సుగుణ-వెంకటేశ్వర్లు, కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత మండల నాయకులు ఎర్ర సురేష్, చందా నాగేశ్వరరావు, పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ కార్యకర్తలు వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

కొత్తది పాతది