Bhadrachalam : సీతారాముల పట్టాభిషేకం వైభవంగా!

 


EB NEWS/bhadrachalam :


భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా కొనసాగుతోంది. శ్రీరామనవమి వేడుకల అనంతరం చైత్ర శుద్ధ దశమి సందర్భంగా నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.


శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం తరువాత, ఈరోజు పట్టాభిషేక వేడుకలు భక్తి పరవశంలో సాగుతున్నాయి. గోదావరి తీరాన వెలసిన భద్రాద్రి క్షేత్రంలో సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడికి వజ్ర కిరీటాలు, పచ్చల పథకంతో దివ్యంగా పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు.


భక్త రామదాసు ఆశయానికి అనుగుణంగా జరుగుతున్న ఈ మహోత్సవం, రాముడి పరిపాలనా దక్షతను, ధర్మపాలనను, లోక కళ్యాణాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తులకు ఈ దృశ్యం కనువిందుగా మారింది.


తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ అన్ని ఏర్పాట్లు చేసింది. భద్రాచలంలో ఈ అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.



Post a Comment

కొత్తది పాతది