అలర్ట్... పినపాక: వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక, కరకగూడెం  మండలంలో కొన్ని వాట్స్అప్ గ్రూపులను హాక్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గ్రూప్ పేరు మార్చి సైబర్ నెరగాళ్లు కొన్ని ఏపీకే ఫైల్స్లను ఫార్వర్డ్ చేస్తున్నారు. అడ్మిన్స్ అప్రమత్తమై  సదరు సైబర్ నేరగాన్ని గ్రూపులో నుంచి రిమూవ్ చేయడం జరిగింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఆ ఫైల్స్ ను డౌన్లోడ్ చేయకండి. అవి డౌన్లోడ్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.

తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి మీ వాట్సాప్ గ్రూపులో మమ్మల్ని యాడ్ చేయండి అని అంటే అసలు చేయకండి.  




Post a Comment

కొత్తది పాతది