పినపాక:లోన్ల ఊబిలో సామాన్య ప్రజలు



పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక మండల వ్యాప్తంగా మధ్యతరగతి, నిరుపేద ప్రజలు రకరకాల కంపెనీల నుంచి ప్రైవేట్ బ్యాంక్ లోన్లు తీసుకొని తలకు మించిన భారాన్ని మోస్తున్నారనే చెప్పాలి. ఒకప్పుడు నిత్యవసర సరుకులు తక్కువకే దొరికేవి ఇప్పుడు ధరలు పెరిగాయి. దాంతోపాటు ఖర్చులు కూడా పెరిగాయి. సగటున నలుగురు ఉన్న కుటుంబానికి పదివేల రూపాయలు కూడా నెలవారి నిత్యవసర సరుకులకు సరిపోవట్లేదని చెప్పొచ్చు. తద్వారా నిరుపేద, మధ్యతరగతి ప్రజల మీద ఆర్థిక భారం పడుతుంది. ఒకటవ తారీకు వస్తుందంటే అమ్మో నేల వాయిదా కట్టాలని గుండెల్లో గుబులు మొదలవుతుంది. ప్రశాంతతలేని ఒత్తిడి జీవితాలను సామాన్య ప్రజలు అనుభవిస్తున్నారు. నేల కాగానే కొన్ని ప్రైవేట్ బ్యాంకుకు సంబంధించిన ఏజెంట్లు ఇంటి ముందు వచ్చి లోన్ కట్టమని తిష్ట వేసి కూర్చుంటారు. కడుపుకు తిన్నా తినకపోయినా ఈఎమ్ఐలు కడుతున్నారు. లోన్ తీసుకున్న వారు ఒక బ్యాంకులో కాకుండా రకరకాల బ్యాంకుల్లో లోన్ తీసుకొని కట్టలేక నానా అవస్థలు పడుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పేద, మధ్యతరగతి వారి జీవితాలు ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది. కొన్ని సందర్భాలలో నెల వాయిదా కట్టలేని పరిస్థితుల్లో అయితే బంగారమో లేక మొబైల్ ఫోనో తనకా పెట్టి కట్టే పరిస్థితి ఉందనే చెప్పాలి. ఇలా పేద మధ్యతరగతి వారు లోన్ల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఖర్చులు పెరుగుతాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సాధారణ ప్రజల పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

2 تعليقات

إرسال تعليق

أحدث أقدم