మహబూబ్ నగర్: రూ. 7, 77, 77, 777. 77 కోట్లతో అమ్మవారికి అలంకారం

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మహబూబ్ నగర్: రూ. 7, 77, 77, 777. 77 కోట్లతో అమ్మవారికి అలంకారం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. శరన్నవరాత్రుల సందర్భంగా, పాలమూరులోని బ్రాహ్మణ వాడి శ్రీ వాసవీ కన్యాకాపరమేశ్వరి ఆలయ నిర్వాహకులు అమ్మవారిని 7, 77, 77, 777. 77 కోట్ల రూపాయలతో అలంకరించారు. ఈ అద్భుతమైన అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.




ఇది కూడా చదవండి...


గొర్రెల మందపై చిరుత దాడి



Sep 28, 2025, ఎన్ కౌంటర్ బులెట్:


గొర్రెల మందపై చిరుత దాడి

గాంధారి మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో ఒక గొర్రె మరణించింది, దీని విలువ సుమారు రూ.20 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం అందించగా, వారు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనతో స్థానిక కాపరులు భయాందోళనకు గురయ్యారు.



ఇది కూడా చదవండి...


రైలు ఎక్కబోయి పడిపోయిన మహిళ.. కాపాడిన టీటీఈ



Sep 28, 2025, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


రైలు ఎక్కబోయి పడిపోయిన మహిళ.. కాపాడిన టీటీఈ

తెలంగాణ : చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు ఎక్కబోయి కాలు అదుపు తప్పి పడిపోయింది. రైలు, ఫ్లాట్ ఫామ్ మధ్యలో పడిపోతున్న మహిళను అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే ఉద్యోగి( ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) సంతోష్ వెంటనే ఆమెను పైకి లాగి రక్షించాడు. అనంతరం ట్రైన్ ఎక్కించాడు. దీంతో క్షణాల్లో మహిళ ప్రమాదం నుండి బయటపడింది. మహిళ ప్రాణాలు కాపాడిన సంతోష్‌ను పలువురు అధికారులు, ప్రయాణికులు అభినందించారు.

Post a Comment

కొత్తది పాతది