బంపర్ ఆఫర్: ఒక్క రూపాయికే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌



 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా BSNL కొత్త ప్లాన్ తీసుకొచ్చింది ' *బీఎస్ఎన్‌ఎల్ ఆజాదీ కా ప్లాన్'* పేరిట లాంచ్ చేసింది. 



ఒక్క రూపాయికే 30 రోజులపాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, రోజుకు 2GB డేటాను అందిస్తోంది. సిమ్ కూడా ఉచితం. 


ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆసక్తిగల వినియోగదారులు BSNL సర్వీస్ సెంటర్ లేదా రిటైలర్‌ను సందర్శించొచ్చు.



ఇది కూడా చదవండి...

కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన..... కాంగ్రెస్ పార్టీ నాయకులు గాండ్ల సురేష్



   మణుగూరు మండలం,గుట్ట మల్లారం గ్రామపంచాయతీ పరిధిలో గల రైతు వేదిక ఎదురుగా నిర్మిస్తున్న మున్నూరు కాపు సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్ (కళ్యాణ మండపం) నిర్మాణ పనులను పర్యవేక్షించిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గాండ్ల సురేష్..


ఈ సందర్భంగా వారు మాట్లాడుతు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఎంతగానో కృషి చేస్తున్నారు.ఎన్నికల ముందు మున్నూరు కాపు సంఘానికి ఇచ్చిన హామీ ప్రకారం మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి పనులు నాణ్యత ప్రమాణాలతో శరవేగంగా జరగటం వారి నిబద్ధతకు నిదర్శనం అన్నారు... 


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జా త్రిమూర్తులు, బడే రామ్మోహన్, పొన్నం రాము, వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ ఏఈ కర్నే పౌల్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

కొత్తది పాతది