మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ ప్రాంతంలో నిన్న (గురువారం) నమ్మదగిన సమాచారంతో పేకాట స్థావరంపై మణుగూరు పోలీసులు దాడులు నిర్వహించారు, ఈ దాడుల్లో పదిమంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని 56 వేల నగదు, పది సెల్ ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది, పేకాట రాయుళ్ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది..ఇట్టి దాడుల్లో మణుగూరు CI నాగబాబు, ఎస్సై రంజిత్,తో పాటు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు..
ఇది కూడా చదవండి...
నేడు ‘కాళేశ్వరం' నివేదికపై కీలక భేటీ!
తెలంగాణ : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ నిన్న తుది నివేదికను ప్రభుత్వానికి అందించిన విషయం తెలిసిందే. దీనిపై CM రేవంత్రెడ్డి నేతృత్వంలో ఇవాళ కీలక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, CS రామకృష్ణారావు, ముఖ్య కార్య దర్శి రాహుల్ బొజ్జా CMకు నివేదిక అందిస్తారని సమాచారం. దీనిపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి...
11 స్థానాల్లో ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి: కేసీఆర్!
Aug 01, 2025,
11 స్థానాల్లో ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి: కేసీఆర్!
తెలంగాణ : పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని పార్టీ నేతలతో చెప్పినట్లు సమచాారం. జూబ్లీహిల్స్ సహా 11 స్థానాల్లో బై ఎలక్షన్స్‌కు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని SC చెప్పిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి...
సర్కార్ బడుల్లో విధులకు డుమ్మా కొట్టడం.. ఆలస్యంగా వచ్చే టీచర్లకు భారీ షాకిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది. టీచర్ల హాజరుకు సంబంధించి ప్రభుత్వం కొత్త సిస్టమ్‌ను అమలు చేయనుంది.
అదే ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానం(ఎఫ్ఆర్ఎస్). ఆగస్టు 1నుంచి సర్కార్ బడుల్లో దీన్ని అమల్లోకి తీసుకువస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పారదర్శకతకు పెద్ద పీట వేసేందుకు తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీని అమలుకు సంబంధించి.. ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆగస్టు 1 నుంచి ఇది ఎంపిక చేసిన పాఠశాలల్లోనే అమల్లోకి వస్తుండగా.. వారం రోజుల వ్యవధిలో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు.
ఈ విధానంలో.. ఉపాధ్యాయులు పని చేస్తున్న పాఠశాల ప్రాంగణం నుంచే వారి హాజరు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం జియో కోఆర్డినేట్ అటెండెన్స్ అమలు కానుంది. దీనిలో భాగంగా టీచర్లు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్కూల్ ఆవరణ నుంచే లాగిన్, లాగౌట్ అవుతూ.. హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ విధానం వల్ల తరచుగా స్కూళ్లకు డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు అవకాశం లభించనుంది. ఇప్పటికే విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ హాజరు ప్రక్రియ అమలవుతుండగా నేటి నుంచి టీచర్లకు కూడా ఇదే విధానంలో హాజరు ప్రక్రియ అమలు కానున్నది.
సర్కార్ బడిలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కొత్తగా రూపొందించిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు.
దీని వల్ల ఆ రోజు క్లాస్‌కి ఎంత మంది విద్యార్థులు వచ్చారు.. మొత్తం పాఠశాలకు ఎంత మంది హాజరయ్యారు.. ఏ సమయంలో హాజరు తీశారు అనే వివరాలు నేరుగా ప్రభుత్వానికే తెలియనున్నవి. ఈ విధానం అమలు వల్ల మధ్యాహ్న భోజనం నిర్వహణ పారదర్శకంగా అమలు కొనసాగుతుంది.
ఇటీవల ఇదే యాప్‌లో స్టాఫ్ అనే విభాగాన్ని యాడ్ చేసి.. కొద్దిరోజుల పాటు ట్రయల్ నిర్వహించారు. ఇక ఆగస్టు 1నుంచి టీచర్లకు కూడా ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని ఆదేశాలు రావడంతో విద్యాశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు.
ఈ విధానంలో ప్రతి టీచర్ పాఠశాలకు వచ్చినప్పుడు.. తిరిగి వెళ్లేటప్పుడు తప్పకుండా ముఖం ఆధారంగా హాజరు నమోదు చేయాలి. దీని వల్ల టీచర్ల హాజరు మెరగవుతుందని భావిస్తున్నారు. నేటి నుంచి అనగా ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి