భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
రాబోయే ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మణుగూరు మండలంలోని ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలతో నృత్య కళాకారులతో కొమ్ము డాన్స్ లతో భారీ ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించుకుంటూ అంబేద్కర్ సెంటర్లోని కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలతో స్మరించుకోవడం జరుగుతుంది. ఆదివాసీల హక్కులను వీరుల యొక్క త్యాగాలను గుర్తు చేస్తూ.. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల తో ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ, గతంలో ఎంతో ఘనంగా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందని, అలాగే ఈసారి కూడా భారీగా ఆదివాసీలతో కల నృత్య బృందంతో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజే యడమైనది. ఈ యొక్క కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు ఆదివాసి సంఘాలు ఆదివాసీ ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు, ఆదివాసీ మేధావులు రాజకీయ నాయకులు, మరియు పాలకులు అందరూ కూడా సహకరించి ఈ యొక్క ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆగస్టు 9న నాడు విజయవంతం చేయవలసిందిగా మణుగూరు ఆదివాసీ జేఏసీ పిలుపునివ్వడం జరుగింది. ఈ యొక్క కార్యక్రమంలో మణుగూరు ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు సోడె రవికుమార్ దొర, ఉపాధ్యక్షుడు పూనెం రమేష్, గనిబోయిన ముత్తయ్య, ఇర్ప రవి, మరియు ఆదివాసీ సేన రాష్ట్ర నాయకుడు కొమరం అనిల్ కుమార్, వజ్జ జ్యోతిబసు, కుంజ రామకృష్ణ, మరియు మండారి కృష్ణ, తదితరులు పాల్గొనడం జరిగింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి