సిపిఐ రాష్ట్ర నాయకులు అయోధ్య రోడ్డు ప్రమాదంలో మృతి

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


నిన్న రాత్రి సూర్యాపేటకు వెళ్లిన అయోధ్య.. 


హైదరాబాద్ ఆసుపత్రిలో చూపించుకునేందుకు సూర్యాపేటకు వెళ్ళినట్లు సమాచారం


 సూర్యాపేటలో నిన్నతన కుమార్తె నివాసములో.

బసజేసి ఉదయాన్నే హైదరాబాద్ వెళ్తానని ఆసుపత్రిలో చూయించుకుని వస్తానని సిపిఐ నేతపుల్లారెడ్డి తో చెప్పిన అయోధ్య


సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజ్ అయోధ్య చారి సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు..


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్ సిపిఐ నేతగా అయోధ్య కు గుర్తింపు






మణుగూరు ప్రజా పోరాటాలలో అయోధ్య పాత్ర మరువలేనిది మరపురానిది నిత్యం సమస్యలతోనే అయిన జీవితం, నాలుగు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలలో పరుగులు పెట్టారు*• మణుగూరు అభివృద్ధిలో భద్రాద్రి పవర్ ప్లాంట్ భూములు కోల్పోయిన అభాగ్యులకు అండగా అయోధ్య పోరాటాలు సిపిఐ పార్టీ ఉద్యమానికి పురుడు పోసింది. నిత్యం ఎర్రజెండా వస్త్రంతో ప్రజా సమస్యల లో ముందుండి ప్రజల పక్షాన న్యాయం కలిగే విధంగా ప్రభుత్వాన్ని అధికారులను నిలదీయడంలో వివరించడంలో ఈ ప్రాంతాన గొప్ప కమ్యూనిస్టు నేతగా ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా *మృత్యువుతో ఎదిరిస్తూనే చివరకు ఆయన పుట్టి పెరిగిన సూర్యపేట లోనే ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ ప్రయాణంలో కారు యాక్సిడెంట్ లో మరణించడం దురదృష్టకరం రాష్ట్ర సిపిఐ ఉద్యమానికి తీరని లోటు మణుగూరు కమ్యూనిస్టు ఉద్యమంలో సింగరేణి కార్మికులతో AITUC యూనియన్ కు దశాబ్దాల తరబడి ఒక పెద్ద దిక్కుగా వ్యవహరించారు

అయోధ్య మరణా విషయాన్ని మణుగూరు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Post a Comment

కొత్తది పాతది