కరకగూడెo:ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కరకగూడెo మండల సోషల్ మీడియా అధ్యక్షునిగా సిద్ది. సునీల్ ఏకగ్రీవంగా ఎన్నికైనందున వారి పేరు ప్రకటిస్తూ... పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ రోజు నుండి BRS పార్టీ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లి, పార్టీకి లాభం జరిగే విదంగా నీ ప్రయత్నం కొనసాగాలని, అధికార పక్షం ఒంటెద్దు పోకడలు అబద్దాలతో ప్రజలను మోసం చేసిన తీరును ఎండగడుతూ... ఎప్పటికప్పుడు కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ... ప్రజలను చైతన్య పర్చాలని కోరామన్నారు. . BRS పార్టీ సాగించే ప్రజా పోరాటంలో అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టేవిదంగా నీ ప్రశ్నలు ప్రజలను చైతన్య పరుస్తూ, మేల్కొలిపే విదంగా ఉండాలని, నీకు భద్రాద్రి రాముని ఆశీర్వాదంతో, భవిషత్ లో మండల కార్యకర్తల అభిమానం చూరగొని పార్టీలో ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నానన్నారు. ఏకగ్రీవంగా కరకగూడెo మండల సోషల్ మీడియా అధ్యక్షులుగా ఎన్నికైనందున జిల్లా BRS పార్టీ పక్షాన ప్రత్యేక అభినందనలు తెలిజేసారు.
إرسال تعليق