మానవత్వం చాటుకున్న సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

 


కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామ పంచాయతీ ఇప్ప చెట్టు గుంపుకి చెందిన గాందర్ల నర్సయ్య  ఇంట్లో పడుకొని ఉండగా పిచ్చి కుక్క ఇంట్లోకి చొరపడి కరవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.. అదే సమయానికి కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అటుగా వస్తూ చూసిన వెంటనే స్పందించి దగ్గరుండి 108 వాహనం ఎక్కించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మానవత్వం చాటుకున్నారని అతన్ని పలువురు అభినందించారు. మొత్తానికి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి అన్న పదాన్ని గుర్తు చేశారని చెప్పాలి.









Post a Comment

కొత్తది పాతది