పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ వాహన తనిఖీలు రోడ్డు భద్రతను పటిష్టం చేయడం, వాహనదారుల పత్రాలు సమష్టిగా ఉండటం వంటి అంశాలను పరిశీలించడానికి జరిగాయి. ఎస్ఐ సురేష్ ప్రజలకు అన్ని వాహన సంబంధ పత్రాలు వెంట ఉంచుకోవాలని, రోడ్డుప్రమాదాలు మరియు ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా పాటించాలని సూచించారు. అనుమానిత వాహనాలు, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి