TG , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
వంద శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఓపెన్ చేయాలి
రాబోయే 2 రోజుల పాటు తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం
2 రోజుల పాటు పంట కోతలు వాయిదా వేసుకోవాలి
పత్తి, ధాన్యం, మొక్కజొన్న పంటల కొనుగోలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన మంత్రులు
రాష్ట్రంలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాలు, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, రవాణా శాఖల అధికారులతో పత్తి కొనుగోలు, అకాల వర్షాల కారణంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతూ* తుఫాను వల్ల అకాల వర్షాల నేపథ్యంలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని, ప్యాడి క్లీనర్లు, తేమ యంత్రాలు అవసరం మేరకు సమకూర్చాలని తెలిపారు.
*రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి మాట్లాడుతూ* తుఫాను తీవ్రత అధికంగా ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తుఫాను తీవ్రత తగ్గేవరకు హార్వెస్టింగ్ ప్రక్రియ నిలిపి వేయాలని, హార్వెస్టింగ్ చేసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పత్తి కొనుగోలు కపాస్ కిసాన్ యాప్ ద్వారా చేయడం జరుగుతుందని, ఈ యాప్ లో కవులు రైతులు కూడా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల సహాయంతో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. వరి ధాన్యం, పత్తి రైతులు తేమ శాతం నిబంధనల ప్రకారం ఉండేలా చూసుకోవాలని, తేమ శాతాన్ని పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని తెలిపారు. సరిహద్దు జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని, బయట రాష్ట్రాల నుండి వచ్చే వరి ధాన్యం, సోయాబీన్, కందులు, పెసలు అక్రమ రవాణా జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు.
*రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ* రాష్ట్రంలోని అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, వర్షాల దృష్ట్యా ధాన్యం అడగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు 2 వేల 389 రూపాయలు, సాధారణ రకానికి క్వింటాలుకు 2 వేల 369 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని, సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 రూపాయలు అదనంగా అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలను కవర్లను అందుబాటులో ఉంచాలని, ధాన్యం తడవకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
*రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ మాట్లాడుతూ* పత్తి కొనుగోలు ప్రక్రియ కొరకు చర్యలు చేపట్టాలని, కపాస్ కిసాన్ యాప్ లో రైతుల వివరాలు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పత్తి కొనుగోలు చేయాలని తెలిపారు.
* *ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ,* ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, సమర్థవంతంగా కొనుగోలు కొనసాగుతున్నదని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస మౌలిక వసతులు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్ కవర్లు వంటి సదుపాయాలు అన్ని కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 193 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సి.సి.ఐ ఆధ్వర్యంలో 6 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో రైతులు హార్వెస్టింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించి, దీనిపై విస్తృత ప్రచారం చేపడతామని చెప్పారు. అదేవిధంగా అధిక వర్షాల పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని కలెక్టర్ వివరించారు.
వీడియోకాన్ ఫ్రెండ్స్ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే రెండు రోజులు పాటు అధిక వర్షాలు ఉన్న నేపథ్యంలో రైతులు హార్వెస్టర్ను తాత్కాలికంగా నిలిపేయాలని సూచించారు దానికి తగినట్టుగా వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు రైతులకు సమాచారం చేరే విధంగా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రతి రోజు ధాన్యం సేకరణ వివరాలు, గన్ని బ్యాగులో వివరాలు నివేదికల సమర్పించాలని దాని ద్వారా ఇంకా ఎంత పంట వస్తుందని అంచనా వేయడం కుదురుతుంది అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులను కపాస్ కిసాన్ యాప్ లో రిజిస్టర్ అయ్యేలా తగిన చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌరసరఫరాల అధికారి రుక్మిణి, మేనేజర్ త్రినాధ్ బాబు, మార్కెటింగ్ శాఖ అధికారి నరేందర్, రవాణా శాఖ అధికారి వెంకటరమణ తదితర అధికారులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి