పినపాక: మిర్చి రైతులకు కంటతడి పెట్టిస్తున్న అకాల వర్షాలు

 


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మిర్చి పంట భారీగా నేలకొరిగి దెబ్బతిన్నాయి. ఈ వర్షాల వల్ల పంటలు తడిసి ముద్దయి, నేలకొరిగాయని రైతులు  ఆందోళన చెందుతున్నారు. పినపాక మండలంలో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండి  మిర్చిపంటలకు నష్టం భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అకాల వర్షాలకు కారణంగా రైతుల ఆర్థిక నష్టం భారీగా ఉండొచ్చు. 

అప్పు తెచ్చి పంట సాగు చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



పోయిన ఏడు మిర్చి సాగు చేసిన రైతులకు దిగుబడి పెద్దగా రాలేదు. అయినా ఈసారైనా నష్టాన్ని ఎంతోకొంత పూడ్చుదామని సాగు చేస్తే అకాల వర్షాల వల్ల మళ్లీ భారీ నష్టాన్ని మిగులుస్తోందని  వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


లక్షల రూపాయల పెట్టుబడితో సాగు చేశామని,   తమ పంటలకు నష్టపరిహారం అందించాలని రైతులు  ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.



Post a Comment

కొత్తది పాతది