మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గానికి చెందిన మణుగూరు పట్టణంలోని కిన్నెరా ఫంక్షన్ హాల్‌లో 20 మే 2025 మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన కీలక సమావేశం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వారు శ్రీ పొదెం వీరయ్య గారు – జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు* మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథులుగా గౌరవ పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు.
అలాగే టిపిసిసి ఆధ్వర్యంలో నియమితులైన జిల్లా అబ్జర్వర్లు:
1. టిపిసిసి ఉపాధ్యక్షులు డా. శ్రవణ్ కుమార్ రెడ్డి
2. టిపిసిసి జనరల్ సెక్రటరీ శ్రీ ప్రమోద్ కుమార్
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మణుగూరు మండలం, టౌన్, బూర్గంపహాడ్ మండలం సారపాక టౌన్, అశ్వాపురం, పినపాక, కరకాగూడెం, గుండాల, మరియు ఆళ్లపల్లి మండలాల స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు మరియు ఏ-బ్లాక్, బీ-బ్లాక్ అధ్యక్ష పదవులకు ఆసక్తి ఉన్న ఆశావహుల నుండి అధికారికంగా దరఖాస్తులను స్వీకరించడం జరిగింది.
అభ్యర్థులందరూ తమ దరఖాస్తులను పార్టీ గైడ్‌లైన్స్ ప్రకారం సక్రమంగా సమర్పించారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తూ, ఈ దరఖాస్తులను అబ్జర్వర్లకు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో నియోజకవర్గం లోని అన్ని కోణాలనుండి వచ్చిన పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం శ్రద్ధాభక్తులతో, పార్టీ పరిపాలనా పద్ధతులకు అనుగుణంగా, విజయవంతంగా ముగిసింది.
ఇలాంటి కార్యక్రమాల ద్వారా పార్టీ పునర్నిర్మాణం పటిష్టంగా జరుగుతుందని, అందరితో కలసి నడిచే నాయకత్వం బలపడుతుందని నాయకులు ఆకాంక్షించారు.
పొదెం వీరయ్య, అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
إرسال تعليق