ప్రతి స్కూల్ బస్సుకు ఫిట్నెస్ తప్పనిసరి: వెంకటరమణ జిల్లా రవాణా అధికారి కొత్తగూడెం.

 


కొత్తగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 

 మంగళవారం నాడు జిల్లా రవాణా కార్యాలయంలో వివిధ స్కూల్ బస్సుల డ్రైవర్లకు బస్సు ఫిట్నెస్, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ వాహనం నడిపే ముందు ఫిట్నెస్ చెక్ చేసిన తర్వాతనే పిల్లలను బస్సులలో ఆహ్వానించాలని, ప్రతి వాహనానికి అటెండెంట్ ఉండాలని, ప్రతి నెల డ్రైవరు తమ ఆరోగ్యం చెక్ అప్ చేసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని,చట్ట ప్రకారం నడుచుకోవాలని, స్కూల్ యాజమాన్యాలు, డ్రైవర్లు

 బాధ్యతగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా స్కూల్ బస్సు పాటించవలసిన నియమాల గురించి కరపత్రాలు విడుదల చేశారు.

Post a Comment

أحدث أقدم