కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి రాజబాబు:
సఖీ కేంద్రం అధ్వర్యంలో ములుగుజిల్లా కన్నాయిగూడెం మండలం లోని గ్రామలలో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సఖీ కేంద్రం అందించే ఐదు రకాల సేవలు
కౌన్సెలింగ్ సేవలు, న్యాయ సహాయం, పోలీస్ సహాయం,
వైద్య సేవలు తాత్కాలిక వసతి గురించి ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి మహిళల , బాలికల చట్టాలు గృహ హింస చట్టం, బాల్యవివాహాల చట్టం, పోక్సో చట్టం, సైబర్ క్రైమ్, వయోవృద్ధుల సంక్షేమం తదితర చట్టాల గురించి ,సఖి కేంద్రంలో వచ్చిన బాధితుల వివరాలను గోప్యంగా ఉంచబడతాయని అత్యవసర సమయాలలో సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నెంబర్లు 181,100,1098,1930, 14567 ఈ కాలంలో జరుగుతున్న హింసలు , లింగ సమానత్వం, విద్య యొక్క ప్రాముఖ్యత, గురించి తెలియజేయడం జరిగింది.
సఖి కేంద్రం-ములుగు ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ కౌన్సిలర్ కల్పన , కేస్ వర్కర్ మౌనిక, పార మెడికల్ స్టాఫ్ రాధా, ఐటీ అసిస్టెంట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి...ఇదెక్కడి విడ్డూరం... భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కొని తిన్నాడు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి