– 20 లక్షల నిధుల మంజూరు.
కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కరకగూడెం – చిరుమళ్ళ గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు బ్రిడ్జిని సోమవారం సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల బ్రిడ్జి సైడ్ వాల్‌కు కోత ఏర్పడిన విషయం స్థానికులను కలవరపర్చింది.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ఎమ్మెల్యే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి రూ. 20 లక్షల నిధులు మంజూరు చేయించారు. సైడ్ వాల్ మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎమ్మార్వో నాగప్రసాద్, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇక్బాల్ హుసేన్, మాజీ సర్పంచ్ పోలేబోయిన శ్రీవాణి తిరుపతయ్య, మండల నాయకుడు యర్ర సురేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి