ఇదెక్కడి విడ్డూరం... భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కొని తిన్నాడు..

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్నాడో భర్త. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జరిగింది. శాంతీపుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో భర్త బాపన్‌ షేక్‌తో కలిసి మధు ఖాతూన్‌ అనే మహిళ నివసిస్తోంది. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బాపన్‌ షేక్‌ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మధు ఖాతూన్‌ అరుపులు, కేకలు మార్మోగాయి. ఆమె ముక్కు, వేలు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి శాంతీపుర్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన మధుఖాతూన్‌.. భర్తపై ఫిర్యాదు చేసింది. ‘‘అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పనీ చేశాడు’’ అని అందులో పేర్కొంది.

Post a Comment

కొత్తది పాతది