బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట

G Rajashekar
By -
0

 



EB NEWS/హైదరాబాద్: 

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టివేసింది.


తనపై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వాదనలను పరిశీలించిన న్యాయస్థానం.. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఈ పరిణామంతో రేగా కాంతారావుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు తీర్పుపై ఆయన అనుచరులు, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)