ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూపరింటెండెంట్...



 ములుగు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 న్యూస్ ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలో అవినీతి అధికారిపై ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం జెడ్పీ కార్యాలయంలో రైడ్ నిర్వహించిన ఏసీబీ అధికారులు, సూపరిండెంట్ సుధాకర్ను రూ.25,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.


అవినీతి లావాదేవీతో సంబంధం ఉందన్న అనుమానంతో జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. తోటి ఉద్యోగి ద్వారా లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు సుధాకర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరినీ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఈ దాడితో జిల్లా వర్గాలలో హల్చల్ రేగింది..

ఇది కూడా చదవండి... ఇదెక్కడి విడ్డూరం... భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కొని తిన్నాడు..

Post a Comment

కొత్తది పాతది